Skip to main content
image

ముందు ముద్దులు పెడతారు. తర్వాతేమో "ఖర్మ" అంటారు. లిప్ లాక్ సీన్ల పై నాయికల డబుల్ గేమ్ వెనుక కథేమిటో తెలుసా....!!

నిజమే! హీరోయిన్లు డబుల్ గేమ్ ఆడుతున్నారు. అందరూ కాదు. కొందరు హీరోయిన్లు. ఉదాహరణకు అర్జున్ రెడ్డి భామ షాలినిపాండే నే తీసుకుందాము. ఇది ఆమెకు డెబ్యూట్ మూవీనె. డెబ్యూట్ మూవీలో ఇంత బోల్డ్ గా నటించడానికి చాలామంది భయపడతారు. కానీ, షాలినిపాండేలో ఎలాంటి భయాలు కనిపించలేదెవ్వరికి. అంతగా ఆ పాత్రలో లీనమయి మరీ నటించింది షాలిని. అదే సమయంలో ఇంట్లో వాల్ల అభిప్రాయానికి వ్యతిరేకంగా సినిమాల్లో యాక్ట్ చేసిందన్న విషయం తెలిసి , అందులోనూ ఈ స్థాయి బోల్డ్ సినిమాలో నటించదని తెలిసి.... చాలా మంది ఆశ్చర్యపోయారు. నటన పట్ల ఆమెకున్న ప్రేమను చూసి అందరూ ఆమెకు ఫిదా అయ్యారు. సినిమా పూర్తయి, రిలీజ్ అయి , బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేంతవరకూ షాలినిపాండే కూడా అర్జున్ రెడ్డి సినిమా పట్ల , అందులో ఆమె బోల్డ్ నటన పట్ల హూందాగానే ప్రవర్తించింది. ఇక

Shalini Pandey

 

ఎప్పుడైతే థియేటర్ల నుండి సినిమా బైటికి వచ్చేసిందో , బుల్లి తెర మీద ఒకటికి మూడు సార్లు ప్రసారం అయిందో ఇక అప్పటినుండి అమ్మడు అసలు విషయం చెప్పడం మొదలు పెట్టింది.

"అర్జున్ రెడ్డి ష్యూటింగ్ జరిగనన్ని రోజులు నరకం అనుభవించాను. ఆ ముద్దు సీన్లు చేసినన్ని రోజులూ నేను పడ్డ ఇబ్బందులు నాకు మాత్రమే తెలుసు....!!" అని అమ్మడు స్టేట్మెంట్ ఇచ్చి అర్జున్ రెడ్డి తో సహా అందరికీ షాక్ ఇచ్చింది....!! అంతవరకూ ఏ ఇంటర్వ్యూలో అడిగినా కథ డిమాండ్ మేరకు అలాంటి సీన్లలో నటించడంలో తప్పేంటి ...??!! అని ఎదురు ప్రశ్నించిన షాలినిపాండే అంతా అయ్యాక ఇలా మాట్లాడటం

 

Shalini Pandey

చూసి ... " ఇంకా నయం . నరకం అనే ఒక్క మాటతో సరిపెట్టింది. కొంతమంది లాగా MeToo అని అల్లరి చెయ్యలేదు...!!" అని కౌంటర్లు కూడా వేసుకుంటున్నారు సినీ జనాలు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకంటే , రెండు రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న " భైరవ గీతం " నాయిక కూడా దాదాపు ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చింది కాబట్టి....!! కాకపోతే , షాలినిపాండే కు ఉన్న ఓపిక ఈ అమ్మడు లో లేనట్టుంది కాబోలు... సినిమా రిలీజ్ వరకు కూడా ఆగలేక చాలా ముందుగానే .... " ఆఖరికి ముద్దులు కూడా పెట్టాల్సి వచ్చింది "

​​dhananjaya

 

అంటూ ఆమధ్య వ్యాఖ్యలు చేసింది నాయిక ఇర్రా మోర్ . సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని షాకింగ్ ప్రకటనలు చేస్తుందో చూడాలి‌ . స్టేజ్ ఆర్టిస్ట్ అయిన ఇర్రా మోర్ కు కూడా ఇది డెబ్యూట్ సినిమానే. వర్మ ప్రమోట్ చేస్తున్న ఈ సినిమాలోనూ బోల్డ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయని ట్రైలర్లు , టిజర్లు చూస్తే అర్థం అవుతుంది.

అయితే, అంత అయ్యాక హీరోయిన్లు ఇలాంటి రివర్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కారణం లేకపోలేదు. సాధారణంగా బోల్డ్ సినిమాల్లొ నటించిన హీరోయిన్ల మీద చాలామంది తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. పచ్చిగా చెప్పాలంటే " ఫలానా సినిమాలో అలా నటించిన ఆ హీరోయిన్ పిలిస్తే వస్తుంది... " అనే ఫీలింగ్ లో బ్రతికేస్తూ ఉంటారు. RX100 సినిమాలో బోల్డ్ గా నటించిన నాయిక పాయల్ కు

dhananjaya

తన సినిమాలో అవకాశాన్ని ఇస్తూ బదులుగా బెడ్ రూం కు రావాలని కండీషన్ పెట్టడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు ఎదురవ్వకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే షాలినిపాండే , ఇర్రా మోర్ లాంటి వర్ధమాన నాయికలు ముందు జాగ్రత్తగా ఇలా రివర్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.....!!

 written by G. G. PRASAD

Facebook comments