Skip to main content
image

బన్నీ ....శంకర్ మైండ్ లో పడ్డాడా ?

పలానా హీరోతో సినిమా చెయ్యాలని దర్శకులకు , పలానా దర్శకులతో పని చెయ్యాలని హీరోలకు మనస్సులో ఉంటుంది. ముఖ్యంగా అగ్ర హీరోలకు , అగ్ర దర్శకులకు ఇలాంటి కోరికలు ఖచ్చితంగా ఉంటాయి. అవకాశం చిక్కినప్పుడల్లా ఇలాంటి తమ కోరికలను పలు వేదికల మీద వ్యక్తపరుస్తూ ఉంటారు సినిమా వాల్లు. కొంతమందైతే తాము చేసే సినిమాల్లొని ఏదో ఒక సన్నివేశాల్లో తాము కలిసి పని చెయ్యాలని భావిస్తున్న , తమకు బాగా నచ్చిన హీరోల -- దర్శకుల గురించి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటారు...!!

chiranjivi

నిన్న ( 29/11/18) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న శంకర్ " 2.O" సినిమాలోని ఓ సన్నివేశంలో బన్నీ మీద తన ప్రేమను వెలిబుచ్చాడు దర్శకుడు శంకర్. కథ ప్రకారం ఓ ట్రక్కులొ వేలాది మొబైల్ ఫోన్స్ తరలిస్తున్న సన్నివేశంలో బ్యాక్ గ్రౌండ్ లో ఆర్య-2 సినిమాలొని ఐటం సాంగ్ ను ప్లే చేశారు. శంకర్ సినిమాలొ బన్ని పాట వినపడటంతో అభిమానుల ఈలలతో , కేరింతలతో థియేటర్లు దద్దరిల్లాయి. అయితే, ఇంతమాత్రానికి బన్నీ తో శంకర్ సినిమా చెయ్యబోతున్నాడని అనుకోవడం సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే గతంలో బాయ్స్ , శివాజీ లాంటి తన సినిమాల్లో ఏకంగా చిరంజీవి పాటలనే కాస్త వాడుకున్నాడు శంకర్. కానీ, ఇంతవరకూ చిరంజీవితొ శంకర్ సినిమా చెయ్యలేదు....!!

 

alluarjun

శంకర్ తొలిచిత్రం " జెంటిల్ మెన్" మొదలు "రోబో పార్ట్ - 1" వరకు శంకర్ చేసిన పలు చిత్రాల ఆడియో ఫంక్షన్ లకు చిరంజీవిని ముఖ్య అతిధిగా పిల్చుకున్న శంకర్ .... రోబో -1 ఫంక్షన్ లో తనతో ఓ సినిమా చెయ్యమని చిరంజీవి లాంటి మెగాస్టార్ స్వయంగా అడిగినా కూడా శంకర్ ఇంతవరకూ చెయ్యలేదు...!! అలాంటి శంకర్ - బన్నీతో సమీపదూరంలొ సినిమా చేస్తాడ‌ని కాని , చెయ్యడని

alluarjun

గాని అనుకోవడానికి లేదు...!! తన సినిమాల్లొ మెగా ఫ్యామిలీ కి చెందిన సినిమాల పాటలను వాడుకోవడం కేవలం మెగాస్టార్ & కో మీద తనకున్న ప్రేమను , అభిమానాన్ని వెలిబుచ్చుతున్నాడని ప్రస్రుతానికి భావించుకోవాల్సిందే....!! అయితే, ఇప్పటికే కేరళ లో దుమ్ను దులుపుతూ రీసెంట్ గా బాలీవుడ్ అగ్ర దర్శకుల దృస్టిలో పడిన బన్నీతో శంకర్ సినిమా చేసినా ఆశ్చర్యం అవసరం లేదు....!! ఎందుకంటే, బన్నీ దర్శకుల సూపర్ హీరో.

 written by G.G.PRASAD

Facebook comments