మెగా ఫ్యామిలీలోకి కేథరిన్ రీ-ఎంట్రీ వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసా....!!
కేథరీన్. నిజానికి చాలా ప్రతిభ గల నటి. కానీ, ఎందుకనో సరైన బ్రేక్ రాలేదు. ఒకదశలొ పలురకాల సినిమా ప్రోగ్రామ్ లలొ స్టేజ్ షోలు చేసుకోవడం తప్ప వేరే పని లేకుండా పోయింది కేథరీన్ కు...!! హిట్ ట్రాక్ లేకపోవడం ఒక కారణమైతే , ఓ తమిళ నిర్మాతతో డేటింగ్ లో ఉందనే రూమర్స్ కూడా ఈమెకు సరైన అవకాశాలు రాకపోవడానికి మరో కారణం....!! ఇలాంటి పరిస్థితులలో మెగాస్టార్ రీ - ఎంట్రీ సినిమా " ఖైదీ నెంబర్ 150" లోని రత్తాలు పాటలో చిరుతో కలిసి చిందులేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఆ పాట ష్యూటింగ్ టైంలో కొరియోగ్రాఫర్ లారెన్స్ తో ఏర్పడిన వివాదం కారణంగాను , తన దురుసు ప్రవర్తన కారణంగాను .... చిరంజీవి ఆగ్రహానికి గురైన కేథరీన్ ను ఆ సినిమా నుండి తప్పించాడు రామ్ చరణ్.

మళ్ళీ మెగా కాంపౌండ్ లోకి కేథరీన్ కు ప్రవేశం ఉండదనే అనుకున్నారంతా. కానీ, బన్నీ జోక్యం చేసుకున్నాడో ( బన్నీకి కేథరీన్ కు మంచి understandings ఉన్నట్టు చాలాకాలం గుసగుసలు వినిపించిన విషయం తెలిసిందే కదా) , లేక "మెగా ఆగ్రహం" చల్లారిందో గానీ ఏ రామ్ చరణ్ అయితే ఆరోజు రత్తాలు పాట నుండి కేథరీన్ ను బైటికి పంపాడో ఇప్పుడు అదే రామ్ చరణ్ ఏకంగా తన సినిమాలోనే ఐటం సాంగ్ చేసే అవకాశం ఇచ్చాడు కేథరీన్ కు....!! ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో చరణ్ చేస్తున్న " వినయ విధేయ రామ" చిత్రంలో చోటు సంపాదించుకుంది కేథరీన్.

అయితే, బన్నీ జోక్యం & చిరంజీవి కోపం.... లాంటివి పక్కన పెడితే .... కేథరీన్ కు అవకాశం రావడంలో బోయపాటి హస్తం కూడా ఉండొచ్చు. ఎందుకంటే, ఇదివరకు కేథరీన్ రెండు సార్లు బోయపాటి సినిమాల్లో చేసింది...!! బోయపాటి చేసిన బన్నీ " సరైనోడు " లొ స్పెషల్ క్యారెక్టర్ , బెల్లంకొండ శ్రీనివాస్ , "జయ జానకి నాయక" సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది కేథరీన్ . సో, బహుశా ఆ సెంటిమెంట్ వల్లో , బోయపాటిని రిక్వెస్ట్ చేసుకుని మెగాకాంపౌండ్ లోకి దూకాలని కేథరీన్ స్వయంగా పావులు కదిపిందో , లేక బోయపాటి నే ఆసక్తి చూపాడోగాని మొత్తం మీద కేథరీన్ అనుకున్నది సాధించింది.
త్వరలో చిరంజీవితోనూ బోయపాటి సినిమా చెయ్యబోతున్న క్రమంలో కేథరీన్ కు చరణ్ సినిమాలొ ఛాన్స్ రావడం మామూలు విషయమేమి కాదు. ఎందుకంటే, కేథరీన్ లాంటి తలబిరుసు మనుష్యులను చిరంజీవి సహించడు.

సరే ఇవన్నీ పక్కనపెడితే , ఈ VVR చిత్రం " సరైనోడు " లాగ హిట్ కొడుతుందో , లేక ----" జయ జానకి నాయక " సినిమా లాగా బోల్తా కొడుతుందో చూద్దాం....!! అసలే , ఇప్పటికే రిలీజ్ అయిన VVR teaser అభిమానులకు అంతగా నచ్చకపోవడంతో బోయపాటి మీద అనుమానాలు మొదలయ్యాయి మరి...
Facebook comments