Skip to main content
image

ఈ సినిమాలో మహేష్ చేస్తున్న మూడు పాత్రలకు ముగ్గురు నిర్మాతలు ....!!

ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకు ఒక నిర్మాత సరిపోరు. ఒకరికి నలుగురు చేతులు కలిపితేనే బడా సినిమా తయారవుతుంది. భారీగా పెరిగిన హీరోల పారితోషికాలు & సినిమా బడ్జెట్ ఇందుకు కారణం. దానికితోడు ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే పెద్దగా ఎవ్వరికీ నస్టాలు రావు. షేరింగ్ లో ఉన్న సౌకర్యం ఇది. ఇక అసలు విషయానికొస్తే.... సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లితో చేస్తున్న "మహర్షి " సినిమాకు ముగ్గురు టాప్ ప్రొడ్యూసర్స్ అశ్వనీదత్ , దిల్ రాజు , PVP ప్రసాద్ లు పెట్టుబడి పెడుతున్నారు.

 

maheshbabu

ఈ ముగ్గురిలోకి అశ్వనీదత్ స్థానం ప్రత్యేకమైనది. ఎందుకంటే, మహేష్ ను " రాజకుమారుడు " చిత్రంతో హీరోగా పరిచయం చేసిన క్రెడిట్ అశ్వనీదత్ దే. ఆమధ్య సినిమాలకు కాస్త దూరం జరిగిన ఈ అగ్రనిర్మాత " మహానటి" సినిమాతో మరోసారి జాతీయస్థాయికి ఎదిగారు . మరో నిర్మాత దిల్ రాజు విషయానికొస్తే ప్రస్తుతం ఈయన హ్యాండ్ హీరోలకు కాదు కదా కనీసం తనక్కూడా కలిసి రావడం లేదు. కాకపోతే ఈ మధ్య " 2.O" చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి బాగానే లాభపడ్డాడు. ఇక PVP విషయానికొస్తే

maheshbabu

ఇప్పటికే 2016 లొ మహేష్ కు " బ్రహ్మోత్సవం" లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చిందీ సంస్థ & మహార్షి సినిమాను డైరెక్ట్ చేస్తున్న వంశీ పైడిపల్లితొనే ఈ సంస్థ ఇదివరకు " ఊపిరి" లాంటి మల్టీస్టారర్ చేసింది. కలెక్షన్లు బాగున్నప్పటికీ ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకోలేకపోయింది. అయితే 2017 లో తీసిన " ఘాజీ" సినిమాతో మాత్రం జాతీయస్థాయిలో ఈ సంస్థ గుర్తింపు తెచ్చుకుంది. మొత్తం మీద ముగ్గురు టాప్ ప్రొడ్యూసర్స్ మహేష్ లాంటి సూపర్ స్టార్ సినిమాను నిర్మిస్తుండటం గొప్ప విషయమే.

 

maheshbabu

అయితే, ఈ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మహేష్ మూడు పాత్రలు పోషిస్తున్నాడు. అలాగని త్రిపాత్రాభినయం కాదు. ఒకే పాత్రలో మూడు రకాల దశలు ఉంటాయి. కాసేపు కాలేజ్ స్టూడెంట్ గా , కాసేపు బిజినెస్ మెన్ గా , చివర్లో యువ రైతుగా ....ఇలా మూడు దశలు ఉంటాయట మహేష్ పాత్రలో. నిన్నటి " భరత్ అనే నేను" సినిమాలొ రైతులకు సంబంధించి ఒక ఎపిసోడ్ ను ష్యూట్ చేశాడట దర్శకుడు కొరటాల. కానీ , ఆ ఎపిసోడ్ ను సినిమాలో వాడుకోలేదట. అలాంటిది ఇప్పుడు మహర్షి సినిమాలొ అదే రైతు పాత్రను చేస్తుండటం గమనార్హం....!! ఆమాటకొస్తే సుకుమార్ తో చేసిన " నేనొక్కడినే" లో మహేష్ చేసిన పాత్రకూడా వ్యవసాయానికి సంబంధించినదే...!!

maheshbabu

సో, మొత్తానికి మహేష్ మూడు పాత్రలతో చేస్తున్న మహర్షి సినిమాకు ముగ్గురు నిర్మాతలన్నమాట....!! అన్నట్టు , ఎప్పుడో 2016 లో ఊపిరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి మళ్ళీ మూడేళ్ళ సుధీర్ఘ విరామం తర్వాత ఈ మహర్షి సినిమాతోనే తెరపైకి వస్తున్నాడు....!!

 written by G.G.PRASAD

Facebook comments