Skip to main content
image

చైతుకు ఒక అతిపెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటో తెలుసా....??!!

బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాల్లెవరు. ప్రతి ఒక్కరికి ఒకోక్క బ్యాట్ హ్యాబిట్ ఉంటుంది. అయితే, ఇక్కడ మనం చైతు గురించి చెప్పుకోబోతున్నది మీరనుకుంటున్న smoking , drinking లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ గురించి కాదు. సినిమాలకు సంబంధించిన ఒక బ్యాడ్ హ్యాబిట్ గురించి....!! అదేమిటంటే , "కథల్ని సరిగ్గా అంచనా వెయ్యలేకపోవడం..." అనే ఒక అతి పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఉంది అక్కినేని నాగ చైతన్య కు....!! అందుకే , అతని సినిమాలు ఎక్కువగా పరాజయాలు చెందుతుంటాయ్....!! తను విన్న కథ జనాన్ని ఏమేరకు సంతృప్తి పరుస్తుందో అనే విషయం గురించి ఆలోచించడు. తనకు నచ్చితే చాలు వెనకాముందు ఆలోచించకుండా ముందడుగు వేస్తాడు.

nagachaithanya

ఇంట్లో నాగార్జున లాంటి సూపర్ మ్యాన్ లాంటి హీరోని , అమల లాంటి అరుదైన నటిని పెట్టుకుని కూడా ....తను విన్న కథల గురించి second opinion తీసుకోడు. తన కథకు తనే న్యాయ నిర్ణేత అవుతాడు. పోనీ తన నిర్ణయాలైనా perfect గా ఉంటాయా అంటే అదీలేదు. తనను తాను బూతద్దంలో చూసుకుంటూ , ఆకాశంలో విహరిస్తూ .... కథలు పట్టుకుని వచ్చినోల్లు అసలేం చెబుతున్నారు ? వాటికి హిట్ కొట్టే లక్షణాలు ఉన్నాయా లేవా ...? లాంటి ప్రశ్నలు తనకు తాను వేసుకుని ఉంటే ఇతని కెరీర్ లో ఫ్లాప్ పర్సంటేజి ఇంత ఎక్కువగా ఉండేది కాదు. తన తోటి హీరోలు కెరీర్ విషయంలో పెట్టిన శ్రద్దలో పదవ వంతు కూడా చైతుకు తన కెరీర్ పట్ల లేదనే విషయం తను చేస్తున్న సినిమాలను గమనిస్తే ఎవరికైనా అర్థం అవుతుంది.

nagachaithanya

తొలి చిత్రం " జోష్ " ఆడియో ఫంక్షన్ లో " సినిమా అనేది నా కల. ఈరోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను..." అంటూ ఎంతో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన చైతు తన సినిమాల్లో ఎమోషన్స్ మిస్ అవుతున్నాయన్న విషయాన్ని కనీసం పట్టించుకోడు. కనీసం , ఒకటిరెండు ఫ్లాప్ లు వచ్చాకైనా కళ్ళు తెరుస్తాడా అంటే అదీ లేదు. సాధారణంగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినోల్లు ఎవరైనా .... తాము చేసే సినిమాలతో , వాటి ఫలితాలతో ఫ్యామిలీ పేరు నిలబెడదామని ఆలోచిస్తారు. చైతులో ఈ ఆలోచన కూడా ఉన్నట్టు కనపడదు...!! కథల విషయంలో తనకు , సమంతకు గొడవలు జరుగుతూనె ఉంటాయని ఆమధ్య చైతు స్వయంగా మీడియాతో చెప్పాడు. తన సినిమాల్లో ఉండనివే కథలు. లేని కథల కోసం గొడవలెందుకో ....!!

 

nagachaithanya

పోనీ నటించే సత్తా లేదా అంటే...ఎందుకు లేదు. పుష్కలంగా ఉంది. చాలా సహజమైన నటుడు ఉన్నాడు చైతులో. " ఏ మాయ చేశావే " సినిమా ఇందుకు మంచి ఉదాహరణ. ఎంత బాగా చేశాడు ఆ సినిమాలో. నాగార్జునను గుర్తు చేశాడు. కానీ , ఆ తర్వాత చేసిన సినిమాల్లో ఏ ఒక్కటీ ఒకమాదిరిగా కూడా లేదు. ఇలాంటి సినిమాలే చేసుకుంటూ పోతే ప్రేక్షకులు చైతును గుర్తు పెట్టుకోరు సరికదా....చివరకు నాగార్జుననే మర్చిపోయే పరిస్థితి వస్తుంది....!!

 written by G.G.PRASAD

Facebook comments