Skip to main content
image

నీతులున్నది చెప్పడానికి - క్రాకర్స్ ఉన్నది కాల్చడానికి అంటున్న ప్రియాంక చోప్రా....!!!!

అవును. నీతులున్నది చెప్పడానికే. ఆచరించడానికైతే కాదు. మనము కూడా social media లో ఎన్నో నీతులు చెబుతూ ఉంటాము. కానీ, ఒక్కటీ ఆచరించే ప్రయత్నం చెయ్యం...!! ఆ మధ్య నటి ప్రియాంకా చోప్రా కూడా తన ట్విట్టర్ ద్వారా సమాజాన్ని ఉద్దరించే ప్రయత్నం చేసింది. గత నెలలో జరిగిన దీపావళి పండుగ గురించి ట్వీట్ చేస్తూ....

priyankachopra

" దీపావళి జరుపుకోండి గాని క్రాకర్స్ కాల్చకండి‌. క్రాకర్స్ కాల్చి పర్యావరణానికి హాని తలపెట్టకండి. క్రాకర్స్ కాలిస్తేనే దీపావళి జరుపుకున్నట్టు కాదు....!!" -- అంటూ ఓ ట్వీట్ వదిలి చేతులు దులుపుకుంది. ఇంతవరకూ అంతా బాగుంది. అయితే, కొన్నిరోజుల క్రింద హాలీవుడ్ సింగర్ నిక్ తో ఘనంగా జరిగిన తన ప్రేమ వివాహ వేడుకలో మాత్రం నిర్వహకులు భారీగా క్రాకర్స్ కాల్చడాన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోయింది....!! పైగా క్రాకర్స్ ను కాలుస్తున్న సదరు ఫోటోలను తనే స్వయంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసి చేతులు కాల్చుకుంది ప్రియాంక చోప్రా....!!

 

priyanka chopra

సెలబ్రిటీలు ఇలాంటి తప్పులు ఎప్పుడు చేస్తారా , ఎప్పుడు తమ చేతికి చిక్కుతారా అని ఎదురు చూసే నెటిజన్లు ఈ విషయంలో ప్రియాంక చోప్రా ను ఒక ఆట ఆడుకున్నారు.

priyanka chopra

 నీతులున్నది చెప్పడానికే కానీ ఆచరణకు కాదులే అని కొందరు , నువ్వు చెప్పిన నీతులు మర్చిపోవడానికి నీకు నెల కూడా పట్టలేదని కొందరు , పర్యావరణం మొత్తం నీ పెళ్ళి లోనే పాచి పట్టుకుపోయిందని కొందరు ..... ప్రియాంక ను తెగ ట్రోల్ చేశారు నెటిజన్లు. ప్రియాంక మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా , మాటవరుసకైనా నెటిజన్లకు సారీ చెప్పకుండా పూర్తిగా పెళ్ళి సంబరాల్లో మునిగిపోయింది....!!

మొత్తానికి , క్రాకర్స్ కాలిస్తేనే కాదు వాటికి సంబంధించి ట్వీట్ లు చేసినా చేతులు కాల్తాయని ప్రియాంక చోప్రా ను చూస్తే అర్థమవుతుంది....!!

 written by G.G.PRASAD

Facebook comments