Skip to main content
image

"2.O" పుణ్యమా అని కాసుల వర్షంలో తడుస్తున్న Book my show సంస్థ....!!

ఒకప్పుడంటే సినిమాకు వెల్లాలంటే టికెట్స్ కోసం థియేటర్లకు వెల్లి క్యూలో నిలబడాల్సి వచ్చేది. సదరు థియేటర్ యాజమాన్యాలు తమ మనుష్యులతో అమ్మించే బ్లాక్ టికెట్స్ ను డబుల్ రేట్ కు కొనాల్సి వచ్చేది. సినిమా పుట్టినప్పటి నుండే ఈ సంప్రదాయం ఉంది. అయితే రోజులు మారాయి‌. థియేటర్లకు పరుగులు పెట్టాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చునే కావాలసినన్ని టికెట్స్ మొబైల్స్ నుండే అడ్వాన్స్ బుకింగ్ లో పొందే అవకాశం వచ్చింది. Book my show లాంటి online platforms ద్వారా tickets business జోరుగా సాగుతోంది.

rajinikanth

గత వారం రిలీజ్ రజనీకాంత్ - శంకర్ ల " 2.O" చిత్రం ద్వారా ఇలాంటి online platforms కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయి. ఇంతవరకూ కేవలం ఒక్క Book my show app ద్వారానే నాలుగు కోట్లకు పైగా 2.O సినిమా టికెట్స్ సేల్ అయ్యాయట...!! ఈ మెగా సేల్ ద్వారా నిర్మాతలకు లాభాలు ఎలాగో భారీగానే ఉంటాయ్.

rajinikanth

నిర్మాతల విషయం పక్కన పెడితే book my show సంస్థ .... ఒకోక్క టికెట్ మీద సుమారుగా 18 రూపాయల వరకు ఛార్జెస్ వసూలు చేస్తోంది. ఈ ఛార్జెస్ లొ సింహభాగం ఈ సంస్థకే వెల్తుంది. అంటే ఆలెక్కన నాలుగు కోట్లకు పైగా టికెట్స్ సేల్ చెయ్యడం ద్వారా ఈ సంస్థ సుమారుగా 70 కోట్లకు పైగా వ్యక్తిగత ఆదాయాన్ని సంపాదించి రికార్డు సృష్టించింది....!! ఇంతవరకూ ఏ సినిమా విషయంలోనూ ఈ సంస్థకు ఈస్థాయి బిజినెస్ జరగలేదు. కలెక్షన్ల విషయంలో ఎన్నో రికార్డులు సృస్టిస్తూ దూసుకుపోతున్న 2.O చిత్రానికి online bookings ద్వారా ఎవ్వరూ ఊహించని ఈ రికార్డును తన అకౌంట్ లో వేసుకుంది.

 

rajinikanth

ఒకప్పుడు చిరంజీవి, రజనీకాంత్ లాంటి అగ్రహీరోల సినిమాల పుణ్యమా అని థియేటర్లలోని పార్కింగ్ ఓనర్లు , క్యాంటిన్ ఓనర్లు లక్షాదికారులు అయిన సంధర్బాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే అగ్రహీరోల సినిమాల టికెట్స్ అమ్మడం ద్వారా Book my show లాంటి online సంస్థలు వారం వ్యవధిలోనే కోట్లకు పడగలెత్తుతున్నాయి....!! సినిమానా మజాక....!!

కొసమెరుపు : ఏ మొబైల్స్ ను అయితే తగ్గించాలని ఈ సినిమాలొ దర్శకుడు శంకర్ జనానికి మెసేజ్ ఇచ్చాడో అవే మొబైల్స్ ద్వారా ఈ చిత్రం కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తుండటం....!!

 written by G.G.PRASAD

Facebook comments