Skip to main content
image

మన భారతీయ సినిమా ఎప్పుడో ఎదిగింది. సినిమాలు చూసే విధానంలో మనమే ఇంకా ఎదగలేదు....!!!!

అవును. సినిమాలు చూడ్డానికి కూడా ఒక పద్దతి ఉంది. సినిమా ఎలా ఉంది అని అడిగితే.... First half బాగుంది -- Second half బాగా తగ్గింది , first half కన్నా second half బాగుంది....అని ఇలాంటి one word రివ్యూలు చెప్పేస్తూ ఉంటారు. మనము ఒక్క క్షణంలో చెప్పేసే ఇలాంటి మాటలు సదరు సినిమాల ఫలితాన్ని తారుమారు చేసేస్తాయి....!! కాకపోతే " రోబో 2.O" లాంటి సినిమాలను ఇలాంటి one word రివ్యూలు టచ్ కూడా చెయ్యలేవు....!! అందుకే ఈ మాటలు ఎంతలా ఎదురైనా , ఎంతమంది ఎదురొచ్చి చెప్పినా " చిట్టి" మాత్రం ఎదురొడ్డి నిలబడి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు .

హీరోయిన్ లేకపోవడం వల్ల రొమాన్స్ మిస్ అయ్యామని , పాటలు లేకపోవడం వల్ల entertainment మిస్ అయ్యామని .... ఇలా మిశ్రమ అభిప్రాయాలను విమర్శకులు వెలిబుచ్చుతుంటే.....ప్రేక్షకులు మాత్రం బాగుందని చెబుతూనే మరోసారి మళ్ళీ చూస్తామని చెబుతున్నారు. చెప్పినట్టె మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. థియేటర్ నుండి బైటికి వచ్చిన ప్రేక్షకులు తెరమీద చూసిన గ్రాఫిక్స్ సన్నివేశాలు గుర్తుకు తెచ్చుకుంటూ మరోసారి థియేటర్ వైపుకు మల్లుతున్నారు .

నిజానికి విమర్శకులు చెబుతున్న విషయాలేవీ ఈ సినిమాలోని నిజమైన లోపాలు కావు. నిజమైన లోపం ఏమిటంటే అక్షయ్ కుమార్ పాత్ర చిత్రణ....!! అవును ఈ పాత్ర విషయంలో శంకర్ పక్షి ప్రేమికుడిగా అక్షయ్ పాత్ర( పక్షి రాజా)ను చూపించారు

Rajinikanth

శంకర్ . ఇక్కడ ఒక కీలకమైన విషయం చెప్పుకోవాలి. సినిమా తొలి సన్నివేశం లోనే అక్షయ్ పాత్ర ఓ మొబైల్ టవర్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు....!! సినిమా తొలి సన్నివేశంలోనే విలన్ పాత్ర ఆత్మహత్య ఎందుకు చేసుకోవడాన్ని ప్రేక్షకుడు ఎలా ఊహించుకుంటాడు ....?? అనే విషయాన్ని పక్కనపెడితే , అసలు ఈ ఆత్మహత్యా సన్నివేశంతో కథను మొదలు పెట్టడమే శంకర్ చేసిన అతి పెద్ద తప్పు....!! ఎందుకంటే, తర్వాతి సన్నివేశాల్లో అక్షయ్ పాత్ర మీద ప్రేక్షకులకు విపరీతమైన సింపతీ కలగడానికి ఈ ప్రారంభమే కారణం అయింది....!!  

akshy kumar

అందుకే, మానవాళిని బ్రతికిస్తూ , మానవాళి నిర్లక్ష్యం వల్ల చనిపోతున్న పక్షుల కోసమే అక్షయ్ పాత్ర ఆత్మహత్య చేసుకుందనే విషయం అర్థమవ్వగానే ఆ పాత్రను ప్రేక్షకుడు ప్రేమించడం మొదలు పెట్టాడు . మన వల్లే పక్షులు అంతరించి పోతున్నాయనే విషయాన్ని రియలైజ్ అవుతాడు ప్రేక్షకుడు. ఇలా ప్రేక్షకుడు రియలైజ్ అవుతున్న క్రమంలో హీరో రూపంలో చిట్టి (రోబో) కథలోకి ప్రవేశిస్తుంది. అలా ఎంట్రీ ఇచ్చిన చిట్టి ( రజనీకాంత్) .... పక్షి రాజా ను గాల్లోకి ఎగరేసి మరీ తంతూ ఉంటే సదరు అక్షయ్ పాత్రను చూసి జనాలు బాధ పడటం ఈ సినిమాలోని అతి పెద్ద లోపం...!! ఎందుకంటే విలన్ ని హీరో కొడుతుంటే ప్రేక్షకుడు సంతోషపడాలే గాని విలన్ పరిస్థితిని చూసి బాధపడకూడదు...!! (కనీసం , పక్షిరాజ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఆ పాత్ర తన గురించి తాను చెప్పే క్రమంలో రివీల్ చేసి ఉంటే బాగుండేది...!!) ఎందుకంటే , విలన్ మీద ఎప్పుడైతే ప్రేక్షకుడికి సింపతీ కలుగుతుందో హీరో పాత్రలో తనను తాను ఊహించుకోవడం ప్రేక్షకుడు మానేస్తాడు ...!! (ఈ సినిమాలో రజనీకాంత్ హీరో కాదు. విలన్. అక్షయ్ కుమారే ఇందులో హీరో... అని ఆడియన్స్ చెప్పుకోవడానికి కారణం ఇదే...!!)

 

rajinikanth

దానికితోడు సినిమా పట్ల ప్రేక్షకుడిలో అసంతృప్తి కలిగి సినిమా ఎంత బాగున్నా రెండవ సారి ఆ సినిమాకు వెల్లడానికి సంకోచిస్తాడు...!! ఫలితంగా రిపీట్ ఆడియన్స్ తగ్గిపోతారు...!! ఈ ప్రమాదమే 2.O చిత్రానికి ఉంది. కానీ, సినిమాలోని అద్బుతమైన గ్రాఫిక్స్ , శంకర్ , రజనీకాంత్ ల పట్ల ఉన్న క్రేజ్ ఈ ప్రమాదం నుండి సినిమాను గట్టెక్కిస్తోంది...!! అందుకే, చూసినోల్లే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు...!! అయినప్పటికీ, చాలామంది ఊహిస్తున్నట్టు ఈ సినిమా బాహుబలి రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు పెద్దగా లేవనే చెప్పాలి. కానీ, బాహుబలి తర్వాతి స్థానం మాత్రమే ఖచ్చితంగా చిట్టి రోబోదే....!!  

shankar

కొసమెరుపు : రజనీకాంత్ ఎంత గొప్ప నటుడైనా వయస్సు ప్రభావమొ ఏమో గాని ఈసినిమాలొ చిట్టి పాత్రలో ఆయన నటన తేలిపోయింది. చాలా చోట్ల ఆయన మొఖంలో expressions అనేవే లేవు. (ష్యూటింగ్ దశలోనే అనారోగ్యంతో ఈ పాత్ర చెయ్యలేక ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవాలని చూసినట్టు రజనీకాంత్ స్వయంగా చెప్పడాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి) అందుకే ఈ చిత్రంలో రజనీకాంత్ కన్నా అక్షయ్ కుమార్ నటనే గొప్పగా అనిపిస్తుంది. & లేడీ రోబో పాత్రను పోషించిన అమీ జాక్సన్ హావభావాలు కూడా అంతంతమాత్రమే...!!

 written by G. G. PRASAD

Facebook comments