Skip to main content
image

అమీర్ సారీ చెప్పాడు. మరి , రవి తేజ సారీ ఎందుకు చెప్పలేదు....??!!

సినిమా హిట్ అయితే క్రెడిట్ మొత్తం హీరోల అకౌంట్ లోకి పోవడం సహజంగా జరిగే ప్రక్రియ. అదే సినిమా ఫ్లాప్ అయితే హీరోతో సహా అందరూ దర్శకుడి వైపే వేలెత్తి చూపిస్తారు. హీరోకి వెంటనే మరో సినిమా ఛాన్స్ వస్తుంది. కానీ, దర్శకుడికి మరో అవకాశం వస్తే అదృస్టమే....!! ఎందుకంటే, చాలామంది దృష్టిలో సదరు సినిమా ఫ్లాప్ కు దర్శకుడు మాత్రమే కారణం. హీరోకు సంబంధమే లేదు మరి....!! ఇక అసలు విషయానికొస్తే ......

shankar

అమీర్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ " థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ " . పెట్టుబడిలో సగాన్ని కూడా ఈ చిత్రం వసూలు చెయ్యలేకపోవడం అమీర్ ఇమేజ్ మీద తొలిసారి అనుమానాలను రేకెత్తించింది. తానెంతో ఇస్టపడే దేశభక్తి కథనే ఎంచుకున్నాడు అమీర్ ఖాన్. అయితే, దర్శకుడి కథనం సినిమాను పేలవంగా మార్చింది. క్లైమాక్స్ తో సహా సినిమాలోని కీలక సన్నివేశాలు ఇదివరకు చాలా సినిమాల్లో చూశామనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగడంతో ఈ సినిమాను అట్టర్ ఫ్లాప్ చేశారు ప్రేక్షకులు. అయితే, ఈ సినిమా ఫ్లాప్ ను పూర్తిగా తన భుజాల మీద వేసుకున్నాడు అమీర్ ఖాన్. పరాజయానికి బాధ్యత వహిస్తూ ప్రేక్షకులకు బహిరంగంగా సారీ చెప్పి తన హుందాతనాన్ని చూపాడు అమీర్.

raviteja

 

మరి , అమీర్ అంతటి నటుడే ఫ్లాప్ అయినందుకు సారీ చెబితే మన మాస్ మహారాజా రవితేజ తన AAA ఫ్లాప్ అయినందుకు కూడా సారీ చెప్పాలి కదా...!!?? కానీ , సారీ చెప్పలేదు సరికదా ఫ్లాప్ క్రెడిట్ మొత్తాన్ని దర్శకుడు శ్రీను వైట్ల మీదికి తోసేసి అతను మాత్రం మరో సినిమా ప్రయత్నాల్లొ మునిగిపోయాడు....!! మరో పక్క ఈ సినిమాకు గాను తనకు రావలసిన

amirkhan

పారితోషికం బ్యాలెన్స్ ఉందంటూ నిర్మాతలను శ్రీను వైట్ల అడిగితే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదంటూ మొహం మీదే తలుపులేశారట మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు...!! హీరోగా తనకు " నీకోసం" లాంటి అవార్డ్ విన్నింగ్ హిట్ ఇచ్చి , దుబాయ్ శీను లాంటి మాస్ హిట్ తో తన కెరీర్ ను నిలబెట్టిన దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి ఇలా ఉంటే ..... రవితేజ మాత్రం ఈ ఫ్లాప్ కు దర్శకుడే కారణం అన్నట్టు మౌనంగా ఉండిపోవడం ఆశ్చర్యకరం....!!!

amirkhan

అమీర్ ఖాన్ కూడా ఉన TOH సినిమా విషయంలో ఇలాగే ఉండిపోవచ్చు. కానీ, అమీర్ అలా చెయ్యలేదు. ఎందుకంటే , అమీర్ ఖాన్ నిజాయితీ గల నటుడు. ఈ నిజాయితీ రవితేజ లాంటి హీరోలలో మచ్చుకైనా లేదు . ఉండి ఉంటే .... ఈ మధ్య కాలంలో రవితేజ ఒకసారి కాదు చాలాసార్లు ప్రేక్షకులకు సారీ చెప్పాలి. ఎందుకంటే, గత కొంత కాలంగా రవితేజ సినిమాలు ఏస్థాయిలో ఫ్లాప్ అవుతున్నాయో అందరికీ తెలుసు....!!

 written by G.G.PRASAD

Facebook comments