Skip to main content
image

ఈ మామాకోడళ్ళ కన్నా ముందే అక్కినేని గారు ఓ విదేశీ చిత్రం ఆధారంగా బ్లాక్ బస్టర్ సినిమా చేశాడు..!! ఆ సినిమా ఏదో తెలుసా....??

ఆమధ్య అక్కినేని నాగార్జున - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన " ఊపిరి " సినిమా " the intouchable " అనే ఒక French చిత్రం ఆధారంగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఫ్రెంచ్ సినిమా ఆధారంగా ఊపిరి కథ రాసుకున్నారనే విషయాన్ని నెటిజన్లు చెప్పేవరకూ ఊపిరి చిత్ర యూనిట్ ఆ విషయాన్ని బైటికి చెప్పలేదనుకోండి....అది వేరే విషయం.

pranmothurulu

త్వరలో సమంత - నందిని రెడ్డి ల కాంబినేషన్లో రూపుదిద్దుకోబోతున్న చిత్రం కూడా .... " మిస్ గ్రామి" అనే ఒక విదేశీ చిత్రం ఆధారంగానే తయారు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇది " ఊపిరి " సినిమా లాగ ఫ్రీమేక్ కాదు.అన్ని అనుమతులతో అధికారికంగా చేస్తున్న పక్కా రీమేక్. అక్కినేని కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు మామాకోడళ్లు విదేశీ చిత్రాల ఆధారంగా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు గాని ఈ ఇద్దరి కన్నా ముందే అక్కినేని నాగేశ్వరరావు గారు హాలీవుడ్ చిత్రం ఆధారంగా బ్లాక్ వైట్ రోజుల్లోనే ఓ సినిమా చేశాడని , ఆ సినిమా ఆధారంగా తర్వాతి రోజుల్లో టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయని మీకు తెలుసా...??!! అయితే , ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవండి.

nagarajuna

 

అక్కినేని చేసిన ఆ సినిమా పేరు " ప్రాణ మిత్రులు ". 1967 లో వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా అప్పట్లో హాలివుడ్ లో ( 1964 లొ) వచ్చిన సూపర్ హిట్ సినిమా " బెకెట్ " స్పూర్తితో చేశారు. ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఈ సినిమా ఆస్కార్ ను కూడా సాధించింది. అన్నట్టు , ఈ సినిమాకు మొత్తం 12 ఆస్కార్ నామినేషన్లు లభించాయి. "బెకెట్" సినిమా రాజరిక నేపథ్యంలో వచ్చిన సినిమా. ఆ రాజ్యంలోని యువరాజుకు , అదే రాజ్యం లోని అతడి మిత్రుడికి మధ్య జరిగే కథే "బెకెట్" సినిమా. ఇక అసలు విషయానికొస్తే , అప్పటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పుల్లయ్య గారికి ఒక కథ అవసరమొచ్చి రచయిత రమణ గారిని సంప్రదించారట. అప్పటికే " బెకెట్ " చిత్రాన్ని చూసి స్పూర్తి పొందిన రచయిత రమణ గారు .... ఆకథను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి " ప్రాణ మిత్రులు" కు పురుడు పోశారట....!! అన్నట్టు , ఈ " బెకెట్ " సినిమా కథ కుడా నేరుగా రాసుకున్న కథ కాదు. ఓ నవల ఆధారంగా రాసుకున్న కథ. ఆ నవల పేరు కూడా " బెకెట్ "....!!

 

nagarjuna

రాజరికవ్యవస్థకు చెందిన " బెకెట్" కథను కార్మిక వ్యవస్థకు సంబంధించిన కథగా మార్చారు రచయిత రమణ. ఇందులో ప్రాణ మిత్రులు గా అక్కినేని , జగ్గయ్య లు నటించారు. కార్మికుల కోసం పోరాడే యువజన నాయకుడిగా అక్కినేని నటన అద్బుతం. ఈ సినిమా అప్పటి కార్మికలోకంలొ పోరాటపటిమను నింపింది. ఈ " బెకెట్ " సినిమా ఆధారంగానే హిందీలో " నమక్ హరామ్ " సినిమా ( 1971) కూడా వచ్చింది. అందులో అమితాబ్ బచ్చన్ - రాజేష్ ఖన్నా లు ప్రాణ స్నేహితులు గా నటించారు. అయితే, బెకెట్ ఆధారంగా "ప్రాణ మిత్రులు" కథను రాసుకున్నానని మన రచయిత రమణ ఒప్పుకున్నట్టుగా ఆ హిందీ సినిమా దర్శకరచయితలు మాత్రం ఒప్పుకోలేదట...!! తర్వాతి కాలంలో ఈ బెకెట్ స్పూర్తితో ఎన్నో సినిమాలు వచ్చాయి. కొండపల్లి రాజా , ఘరానా మొగుడు , ముఠామేస్త్రీ , మాస్టర్ లాంటి ఎన్నో సినిమాల్లొ "బెకెట్" సినిమా ఛాయలు కనిపిస్తాయి....!!!!

 

samantha

ఏది ఏమైనా , హాలీవుడ్ సినిమాల ఆధారంగా కథలు రాసుకోవడం అనేది బ్లాక్ & వైట్ రోజుల నుండే ఉందనే నగ్న సత్యం దీన్నిబట్టి అర్థమవుతుంది....!! అన్నట్టు , మీరు ఇంతవరకూ చదివిన రచయిత రమణ గారు ఎవరో కాదు దర్శక దిగ్గజం బాపు గారి అనుంగు మిత్రుడు ముళ్లపూడి వెంకటరమణ గారు....!!

 written by G.G.PRASAD

Facebook comments